సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

3చూసినవారు
బైంసా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గంలోని 144 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద రూ. 35.50 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం పంపిణీ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యచికిత్సలు చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని, పార్టీలకు అతీతంగా ఈ సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్