బైంసా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 135 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ. 28.29 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఈ సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.