నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన భవేశ్ మిశ్రాను శుక్రవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముధోల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు పండించిన పంటలను విక్రయించుకునేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు.