నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని మొగిలి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి ఆలయ జాతర శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు ప్రత్యేక పూజలతో ప్రారంభమై, భక్తుల సందడితో కొనసాగాయి. జాతరలో దుకాణాలు, రంగుల రాట్నాలు, మల్లయోధుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుస్తీ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఎస్సై షేక్ జుబేర్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తుతో జాతర ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. భక్తుల రాకతో మొగిలి గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.