కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిసిన ముధోల్ ఎమ్మెల్యే

4చూసినవారు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిసిన ముధోల్ ఎమ్మెల్యే
గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్ పవార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం పనులను త్వరగా చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే, పాయల్ శంకర్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :