నిజామాబాద్‌కు చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల కారణంగా బుధవారం బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంతో, నారిశక్తి బృందం ఘటన స్థలానికి చేరుకుని ఆ మహిళ ప్రాణాలను కాపాడింది. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనలో నారీశక్తి బృందం సభ్యురాళ్లు దీపిక, సుమేరలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.