బైంసా పట్టణంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బీజేపీపై కాంగ్రెస్, ఏఐఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో 14 కౌన్సిలర్ స్థానాలు గెలిచి, మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మతతత్వ పార్టీ ఏఐఎంఐఎంను ఎన్నికల్లో బొంద పెడతామని హెచ్చరించారు. బీజేపీలో టికెట్ల విషయంలో అంతర్గత కలహాలు సహజమని, కోర్ కమిటీ నిర్ణయం మేరకే టికెట్లు కేటాయిస్తామని తెలిపారు.