ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ తాండ గ్రామ పంచాయతీలో నూతన చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను శనివారం అధికారులు ప్రారంభించారు. ఎంపీఓ శివ కుమార్ గ్రామంలో పర్యటించి దరఖాస్తుదారుల అర్హతలను నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేశారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ప్రభుత్వ నిబంధనల మేరకు పెన్షన్ అందేలా పారదర్శకంగా పరిశీలన జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుమ్ నాయక్, ఉపసర్పంచ్ అంబర్ సింగ్, సెక్రటరీ ప్రవీణ్, నాయకులు జై చంద్ (జలు) తదితరులు పాలొన్నారు.