పోలియో చుక్కలతోనే శిశువులకు రక్షణ: సర్పంచ్ ప్రవీణ్

800చూసినవారు
పోలియో చుక్కలతోనే శిశువులకు రక్షణ: సర్పంచ్ ప్రవీణ్
నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి(బి) గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ మడి ప్రవీణ్ ప్రారంభించారు. తన కుమార్తెకు పోలియో చుక్కలు వేయించి, అనంతరం గ్రామంలోని ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేయించారు. నిండు జీవితానికి రెండు చుక్కలే రక్షణ అని, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్