శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ముధోల్లోని శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళా సమారోప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు, ముధోల్ గ్రామ సర్పంచ్ షబానా ఇజాజ్ ఉద్దీన్, వ్యవసాయ పరిశోధనా కేంద్రం ముధోల్ ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త, అధిపతి డా. ఆహిలా దినేష్, ప్రజా ట్రస్ట్ చైర్మన్,
బీజేపీ నాయకులు మోహన్‌రావు పటేల్ పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.