భైంసా రూరల్ ఎస్సై శంకర్ మంగళవారం కుంసర గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారం, ర్యాలీలకు అధికారుల అనుమతి తప్పనిసరి అని, రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.