విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలి
By Sandeep 0చూసినవారుబాసర ఐఐఐటీలో విద్యార్థులకు ప్రపంచస్థాయి నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఐఐఐటి క్యాంపస్‌ను సందర్శించిన కలెక్టర్, అధికారులతో సమావేశమై విద్యార్థుల సంఖ్య, విద్యా విధానం, అధ్యాపకులు, వసతి సౌకర్యాలు, విద్యార్థుల విజయాలపై చర్చించారు. విద్యార్థులను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దాలని సూచించారు.