మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం

1చూసినవారు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్, మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్ బుధవారం బైంసా పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ఆశావాహులతో సమావేశం నిర్వహించారు. పార్టీ టికెట్ ఎవరికి కేటాయించినా, అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి నారాయణ రావు పటేల్, ఇతర నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :