
బంగ్లా క్రికెటర్‌ను వదులుకోవాలని KKRకు బీసీసీఐ ఆదేశం
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువుల మీద వరుస దాడుల నేపథ్యంలో.. ముస్తాఫిజుర్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వన్నాయి. దీంతో బంగ్లా ఆటగాడిని వదులుకోవాలని కేకేఆర్‌కు బీసీసీఐ ఆదేశించింది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌కు ఎంచుకోవడం మీద తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజా చర్యలు చేపట్టినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.




