జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, గడువులోగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంజూరైన ఇండ్లు, వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలు, పూర్తయిన ఇండ్ల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, పనుల్లో వేగం పెంచేలా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.