బాసరలో 11వ ఆయుర్వేద దినోత్సవం
నిర్మల్ జిల్లా బాసరలోని ప్రభుత్వ హోమియోపతి డిస్పెన్సరీలో 11వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో "Ayurveda for a Healthier Tomorrow" అనే థీమ్ తో సెప్టెంబర్ 23న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్ డా. రుబీనా, యోగా ఇన్ స్ట్రక్టర్లు గంగాధర్, శిరీష, సిబ్బంది, రోగులు, స్థానికులు పాల్గొన్నారు. ఆయుర్వేదం, యోగా ద్వారా ఆరోగ్యకర జీవనశైలి, రోగనిరోధక శక్తి పెంపుపై అవగాహన కల్పించారు.