నిర్మల్ జిల్లాలో రూ. 247.93 కోట్లతో 138.14కి.మీ రోడ్లు
నిర్మల్ జిల్లా ఆర్&బీ శాఖకు హెచ్‌ఏఎం కింద 8 రహదారుల పనులకు రూ. 247. 93 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 138. 14 కి. మీ మేర రోడ్లను రెండు వరుసలుగా విస్తరించి, బలోపేతం చేయనున్నారు. నిర్మల్ - 3 పనులు, 56. 86 కి. మీ, రూ. 75. 51 కోట్లు, ముధోల్ - 3 పనులు, 53. 88 కి. మీ, రూ. 97. 16 కోట్లు, ఖానాపూర్ - 2 పనులు, 27. 40 కి. మీ, రూ. 75. 26 కోట్లు కేటాయించనున్నారు. ఈ రోడ్ల అభివృద్ధితో జిల్లాలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.