బాసర ఆర్జీయూకేటీలో క్వాంటమ్ సాంకేతికతపై 3 రోజుల సదస్సు

1చూసినవారు
బాసర ఆర్జీయూకేటీలో క్వాంటమ్ సాంకేతికతపై 3 రోజుల సదస్సు
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో “క్వాంటమ్ కమ్యూనికేషన్స్, అప్లికేషన్స్” అంశంపై మూడు రోజుల ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. నవంబర్ 4 నుంచి 6 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని మెకానికల్ విభాగం నిర్వహిస్తుండగా, సంజ్ఞా టెక్నాలజీస్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. వీసీ ప్రొ. ఎ. గోవర్ధన్, సంజ్ఞా సీఈఓ డా. రవీంద్ర బార్లింగే, క్యూక్లైర్‌వాయన్స్ డైరెక్టర్ కల్నల్ సాయి శంకర్ పాల్గొన్నారు. కోఆర్డినేటర్ డా. కె. మహేష్ మాట్లాడుతూ క్వాంటమ్ సాంకేతికత కీలకమన్నారు. రూ. 40 లక్షల విలువైన 40 లైసెన్సులు ఉచితంగా ఇస్తున్నట్లు, ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్