నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ లో భాగంగా 66 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించినట్లు ఎస్పీ జానకీ షర్మిల బుధవారం తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 54 మందిపై కేసులు నమోదు చేశారు. బాల కార్మికులు కనిపిస్తే 1098 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.