బాసరలో 928 అక్షరాభ్యాసాలు

1066చూసినవారు
బాసరలో 928 అక్షరాభ్యాసాలు
ఏరువాక పౌర్ణమి పర్వదినం కలిసి రావడంతో, సోమవారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో 928 అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఆలయానికి మొత్తం రూ. 9.62 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ, ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్