గోదాదేవి గాజుల పూజతో భక్తి సౌభాగ్యాల కలయిక

2చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో శుక్రవారం, ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదాదేవి గాజుల పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోదాదేవి అమ్మవారికి గాజులతో పూజించి, సహస్రనామ అర్చన చేశారు. భక్తి, సౌభాగ్యానికి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, అనంతరం భక్తులకు గాజులను ప్రసాదంగా పంచుతారని అర్చకులు తెలిపారు. అంతకుముందు పల్లకి సేవ కూడా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్