నిర్మల్ జిల్లాలో పిడుగుపాటుతో ధ్వంసమైన ప్రహరీ గోడ

538చూసినవారు
నిర్మల్ జిల్లా, తానూర్ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం, మెరుపులతో కూడిన పిడుగుపడింది. ఒక ఇంటి స్లాబ్‌పై ఉన్న ప్రహరీ గోడపై పిడుగు పడటంతో అది పూర్తిగా ధ్వంసమై కూలిపోయింది. పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోని వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పి ప్రాణనష్టం నివారింపబడింది.

సంబంధిత పోస్ట్