నిర్మల్ జిల్లాలోని వైకుంఠపుర్ గ్రామానికి చెందిన సతెల్లి సాయి ప్రసాద్ అనే యువకుడు స్నేహితులతో కలిసి సోమవారం మధ్యాహ్నం గ్రామంలోని వాగులో స్నానం చేయడానికి వెళ్లి, ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.