బాసర గోదావరి బ్రిడ్జిపై యువకుడు హల్ చల్
నిర్మల్ జిల్లా బాసర గోదావరి బ్రిడ్జిపై బైక్ కొనివ్వాలని ఇంట్లో గొడవపడి, గోదావరిలోకి దూకి చనిపోతానని బెదిరించిన నవీన్ అనే యువకుడిని వాగ్దేవి లేబర్ కాంట్రాక్ట్ సిబ్బంది, బోటింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది సోమవారం సకాలంలో స్పందించి కాపాడారు. బైక్ కొనిస్తామని హామీ ఇవ్వడంతో అతను కిందకు దిగాడు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.