నిర్మల్ పట్టణంలో అదనపు కలెక్టర్ విస్తృత పర్యటన

71చూసినవారు
నిర్మల్ పట్టణంలో అదనపు కలెక్టర్ విస్తృత పర్యటన
వర్షాకాలం ముందు నాళాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నిర్మల్ పట్టణంలోని జౌలీ నాళ, చైన్ గేట్ నాళా, దివ్యనగర్ పార్క్, రాంజీ గోండు విగ్రహ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. వరద నీటి ప్రవాహానికి అంతరాయం కలగకుండా నాళాల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించాలని సూచించారు. ప్రజలు నాళాల్లో చెత్త వేయవద్దన్నారు.

సంబంధిత పోస్ట్