ఈ నెల 3న మంగళవారం కేతుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం కారణంగా సారంగాపూర్ మండలంలోని అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి ఆలయం మూసివేయనున్నట్లు ఈవో భూమయ్య ఆదివారం తెలిపారు. ఉదయం 6 గంటలకు అభిషేకం, అలంకరణ, హారతి, నివేదన అనంతరం 7 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం లభిస్తుంది. మార్చి 4న బుధవారం ఉదయం 6 గంటలకు గణపతి గౌరీ పూజ, ఆలయ సంప్రోక్షణ అనంతరం దర్శనాలు పునఃప్రారంభమవుతాయని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.