AIMIM: వార్డుల ఓటర్ జాబితాలు పరిశీలించాలని అజీం బిన్ యహియా పిలుపు
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, AIMIM అధ్యక్షుడు అజీం బిన్ యహియా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వార్డుల ఓటర్ జాబితాలను పునః పరిశీలించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలని, పట్టణంలోని 42 వార్డులలో సగానికి పైగా గెలుపే లక్ష్యంగా కష్టపడాలని సూచించారు. అధిష్టానం సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.