యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో నిర్ణీత సమయానికి కొనుగోలు ప్రక్రియను ప్రారంభించి గడువులోపు పూర్తి చేయాలని, కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి తగిన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ధాన్యం అమ్మకానికి వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.