బాసర ట్రిపుల్ ఐటీలో రెమిడియల్ పరీక్షల నిబంధనలు, వసతి సదుపాయాలపై కొన్ని సంఘాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆర్జీయూకేటీ యాజమాన్యం స్పష్టం చేసింది. విద్యార్థుల భద్రత, క్రమశిక్షణ, ప్రశాంత వాతావరణమే లక్ష్యమని పేర్కొంది. దూర ప్రాంత విద్యార్థులకు ముందురోజు రాత్రే ప్రవేశం, వసతి కల్పిస్తున్నామని, వరుస
పరీక్షలు ఉన్నవారికి పూర్తిస్థాయి వసతి ఇస్తున్నామని తెలిపింది. బి18, బి19, బి20 బ్యాచ్లకు ఈనెల 8న సర్క్యులర్ జారీ చేశామని, గత తొమ్మిది రోజులుగా
పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని వివరించింది.