సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన రైతులు శనివారం చించోలి (బి) గ్రామ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో లారీల కొరతతో ధాన్యం నిలిచిపోయిందని, తాలు, తరుగు, హమాలి, లారీ ఖర్చుల పేరుతో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుతో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు అధికారులను కోరారు.