
చాయ్ వాలాగా 103 ఏళ్ల బామ్మ !
గుజరాత్ లోని వడోదరలో 108 ఏళ్ల కాశీబా అనే వృద్ధురాలు మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం సమీపంలో టీ స్టాల్ నడుపుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె అల్లం టీకి ఎంతో క్రేజ్ ఉంది. దశాబ్దాలుగా తన టీ రుచితో విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. స్వయంగా అల్లం తురిమి టీ తయారు చేసే కాశీబా, వయసులో విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా అచంచలమైన సంకల్పంతో వ్యాపారం చేస్తూ ఆత్మనిర్భరతకు ప్రతీకగా నిలుస్తున్నారు. 1993 నుంచి ఈ టీస్టాల్ నడుపుతున్న ఆమె, ఎందరో విద్యార్థులకు మధుర జ్ఞాపకాలను అందిస్తున్నారు.




