దళితుల భూమి కబ్జాపై అంబేద్కర్ యువజన సంఘం ఆగ్రహం

0చూసినవారు
సోన్ మండలం పాక్ పట్లలో దళితుల భూమిని కబ్జా చేసి మట్టి రోడ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బత్తుల రంజిత్, వెంకటస్వామిలు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసి, ఆక్రమణదారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కోరారు. న్యాయం కోసం పోరాడుతున్న తమ సంఘ నాయకులపై కేసులు వేయడం, బెదిరింపులకు పాల్పడటం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :