గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని ఏఎంసీ చైర్మన్ సోమా భీం రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గస్థాయి సీఎం కప్ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా మండలాల నుండి హాజరైన క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఈవో భోజన్న, తహసిల్దార్ ప్రభాకర్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.