బాసర ఐఐఐటీలో ‘ఆమె కథ’ పుస్తకావిష్కరణ

0చూసినవారు
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో పూర్వ విద్యార్థిని జక్కా శ్రావణితో ఇంటరాక్టివ్ సెషన్, ‘ఆమె కథ’ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. వైస్ ఛాన్సలర్ ప్రొ. ఎ. గోవర్ధన్ మాట్లాడుతూ కష్టపడే విద్యార్థులకు ట్రిపులైటీ వరమని, పట్టుదలతోనే గొప్ప భవిష్యత్తు సాధ్యమన్నారు. శ్రావణి తన ప్రస్థానాన్ని వివరిస్తూ బి. టెక్ తర్వాత ఐబీఎంలో మూడేళ్లు పనిచేసి, బ్రిటన్‌లో మాస్టర్స్ చేసి ప్రస్తుతం డెలాయిట్ యూకేలో పనిచేస్తున్నట్లు చెప్పారు. రచయిత్రి రోజ రచించిన ‘ఆమె కథ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్