నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం మంగళవారం ఘనంగా జరిగింది. దేవదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవి కిషన్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ తో పాటు ధర్మకర్తలు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన పాలకమండలి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు, కౌన్సిలర్ లు పాల్గొన్నారు.