ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య
Mar 01, 2026, 01:03 IST/

చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

Mar 01, 2026, 01:03 IST
చనిపోతావని ఓ జ్యోతిష్కుడు చెప్పడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ప్రాణాలు తీసుకుంది. బెంగళూరు బాగలకుంటె ఎంఈఐ లేఔట్‌కు చెందిన విద్యాజ్యోతి(29)కి ప్రేమించిన యువకుడితో 9 రోజుల కిందటే వివాహం జరిగింది. అయితే.. 'నువ్వు ఎక్కువ కాలం భూమ్మీద మనుగడ సాగించలేవు. ఈ తొమ్మిది రోజులూ పూజలు చేయి. ఆఖరి రోజైన.. శుక్రవారం నీ తాళి తీసి అమ్మవారికి సమర్పిస్తే మంచి జరుగుతుంది' అని వర్క్‌ ఫ్రం హోంలో ఉన్న ఆమెకు ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. ఆయన మాటలకు భయపడిపోయిన ఆమె అలానే పూజలు చేసి.. తొమ్మిదో రోజు శుక్రవారం రాత్రి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.