అతి చిన్న వయసులో ఋగ్వేద ఘనాంతం పూర్తి చేసిన అధర్వ
నిర్మల్ జిల్లా బాసర చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో కఠినమైన ఋగ్వేద ఘనాంతాన్ని పూర్తి చేసిన అధర్వ బాసర్కర్, సనాతన ధర్మ సమాజానికి ఆనందదాయకమని ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి సోమవారం తెలిపారు. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ జ్ఞాన సరస్వతి అనుగ్రహంతో బాల ఘనాపాఠి అధర్వ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించి వేద విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశీర్వదించారు. వేద పఠనం అంతరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి బ్రాహ్మణ బీజాలు అంకురించడం అభినందనీయమని వైదికులు హర్షం వ్యక్తం చేశారు.