తానూర్ లో వికసిత్ భారత్ పై అవగాహన కార్యక్రమం

5చూసినవారు
తానూర్ లో వికసిత్ భారత్ పై అవగాహన కార్యక్రమం
తానూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ఎంపీడీఓ శ్రీధర్ అధ్యక్షతన వికసిత్ గ్రామ్ పంచాయతీ ప్లాన్’ మరియు ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ చట్టం-2025’ పై సామర్థ్య పెంపు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి పథకాల సమర్థవంతమైన ప్రణాళిక, వివిధ శాఖల సమన్వయం, గ్రామ పంచాయతీ స్థాయిలో పథకాల అమలు తీరుపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ, ఎంఈఓ నరేందర్, ఏపీఎం సులోచన, ఏపీఓ శివలింగం, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్