సోన్ మండలం కడ్తాల్ గ్రామ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం కార్తీక పౌర్ణమి వేడుకలకు సిద్ధమైంది. బుధవారం అయ్యప్పకు ఇష్టమైన రోజు కావడంతో, జిల్లాతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాల నుండి భక్తులు స్వామివారి మాలాధారణ స్వీకరించడానికి తరలిరానున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. గురుస్వామి నర్సారెడ్డి ఈ వివరాలను తెలిపారు.