కార్తీక పౌర్ణమి సందర్భంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామ శ్రీ ధర్మశాస్త దేవాలయం బుధవారం అయ్యప్ప సంకీర్తనలు, శరణుఘోషతో పులకరించింది. ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలకు చెందిన పలువురు అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ గురుస్వామి నర్సారెడ్డి నేతృత్వంలో మాలాధారణ ధరించిన భక్తులకు నియమాలను వివరించారు.