ఓవైసీ బ్లాక్ మెయిల్ తోనే అజారుద్దీన్ కు మంత్రిపదవి

584చూసినవారు
ఓవైసీ బ్లాక్ మెయిల్ తోనే అజారుద్దీన్ కు మంత్రిపదవి
బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి శుక్రవారం మాట్లాడుతూ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ బ్లాక్‌మెయిల్ రాజకీయాల వల్లే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు టికెట్ ఇప్పించింది కూడా ఓవైసీనే అని విమర్శించారు. దేశద్రోహానికి పాల్పడిన అజారుద్దీన్‌కు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఇవ్వడంపై ఆయన ప్రశ్నించారు. ఓవైసీతో కలిసి రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :