త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను నిర్మల్ జిల్లా కేంద్రంలో ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఈద్గా వద్ద సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. మత పెద్దలు పండుగ విశిష్టతను వివరించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.