నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు భైంసా పట్టణాలలో గురువారం జరిగిన బక్రీద్ పండుగ ప్రార్థనలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించిందని పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలో ప్రార్థనల అనంతరం ఎస్పీ చిన్నారులు, ముస్లిం సోదరులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపి, వారితో ఆప్యాయంగా మాట్లాడి ఆనందాన్ని పంచుకున్నారు.