బాసరలో బలరామ జయంతి వేడుకలు
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బలరామ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యవసాయానికి ఆద్యుడైన బలరాముడిని స్మరించుకుంటూ, రైతుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మండలంలోని 8 మంది ఉత్తమ రైతు దంపతులను గుర్తించి శుక్రవారం శాలువాలు కప్పి సన్మానించారు. సుబేదార్ శివాజీ పటేల్, నాగేష్, పోతిగంటి విజయ్ రావు, హల్ద గంగాధర్, గౌరోల్ల సాయినాథ్, గౌరోల్ల రాజేశ్వర్, సుబేదార్ రఘునాథ్ పటేల్, నానం నర్సయ్యలు సన్మానం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.