పంచాయతీ ఎన్నికలు: ప్రత్యర్థులను బుజ్జగించేందుకు రాయబారాలు, బేరసారాలు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమ ప్రత్యర్థులను బుజ్జగించేందుకు కొందరు రాయబారాలు, బేరసారాలు సాగిస్తున్నారు. ఈసారి సర్పంచ్ పదవి ఇస్తే, తదుపరి ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. లేదంటే, ఈసారి ఉపసర్పంచ్ పదవిని స్వీకరించి, ఐదేళ్ల తర్వాత సర్పంచ్ పదవిని కట్టబెడతామని హామీలు ఇస్తూ, ప్రమాణాలు కూడా చేస్తున్నారు.