ఎమ్మెల్యే పవార్ రామారావుతో బాసర బీజేపీ శ్రేణులు భేటీ

0చూసినవారు
ఎమ్మెల్యే పవార్ రామారావుతో బాసర బీజేపీ శ్రేణులు భేటీ
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను బాసర మండల బీజేపీ శ్రేణులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశాయి. ఈ సందర్భంగా బాసర మండలంలో బీజేపీ పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ సూచించారని బాసర మండల బీజేపీ సీనియర్ నాయకులు కోదటి భగవంత్ రావు తెలిపారు. అలాగే కార్యకర్తల సమస్యలు, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్