
గ్యాస్ సిలిండర్ల వరుస పేలుళ్లు.. ఒకరు మృతి (వీడియో)
చండీగఢ్‌లోని బరిల్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన వరుస ఎల్పీజీ సిలిండర్ పేలుళ్లలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ఇంటితో పాటు సమీపంలోని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో సుమారు 10 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు, అయితే అక్రమ గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.




