బాసర మండల పరిషత్ సమావేశం అక్టోబర్ 1న
నిర్మల్ జిల్లా బాసర మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు మండల పరిషత్ సమావేశ హాల్లో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో దేవేందర్ రెడ్డి నోటీసు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు, ప్రత్యేక అధికారి నోట్ ఫైల్ ఆమోదం మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గత సమావేశ తీర్మానాల ఆమోదంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, ఆర్డబ్ల్యూఎస్, ఏఈపీఆర్, ఆర్టీసీ, ఇందిరా క్రాంతి, వీబీజీ రామ్-జీ తదితర 19 అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం నిర్మల్ జిల్లా, ముథోల్ లో జరగనుంది.