
గండికోటలో 'రణబాలి' యాక్షన్.. వీడియో వైరల్
AP: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాల కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రణబాలి' షూటింగ్ ప్రస్తుతం రాయలసీమ ఖిల్లా గండికోటలో జరుగుతోంది. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులు, రాయలసీమ చారిత్రక బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం గండికోటలోని చారిత్రక కట్టడాలను లొకేషన్లుగా ఎంచుకున్నారు. విజయ్ దేవరకొండ గుర్రపు స్వారీ చేస్తూ శత్రువులను వేటాడే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఈ షెడ్యూల్‌కే హైలైట్ అని తెలుస్తోంది. లీకైన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




