బాసర ట్రిపుల్ ఐటీ పరీక్షలు వాయిదా

688చూసినవారు
బాసర ట్రిపుల్ ఐటీ పరీక్షలు వాయిదా
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ - ట్రిపుల్ ఐటీలో సెప్టెంబర్ 25, 26 తేదీల్లో జరగాల్సిన రెండు రీమెడియల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో గణేష్ నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రభుత్వం సెప్టెంబర్ 25న సెలవు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరీక్షల విభాగం తెలిపింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని పీఆర్ఓ పేర్కొన్నారు. ఈ పరీక్షలు నిర్మల్ జిల్లా, ముథోల్ ప్రాంతంలో జరగాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్